వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే బుగ్గవంక బ్రిడ్జిలకు నిధులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే బుగ్గవంక బ్రిడ్జిలకు నిధులు

Sep 30 2025 7:45 AM | Updated on Sep 30 2025 7:45 AM

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే బుగ్గవంక బ్రిడ్జిలకు నిధులు

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే బుగ్గవంక బ్రిడ్జిలకు నిధులు

కడప కార్పొరేషన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే బుగ్గవంకపై షామీరియా మసీదు, లా కాలేజీల వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎస్‌ఎండీ షీఫీ, అజ్మతుల్లా అన్నారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో డివిజన్‌ ఇన్‌చార్జులు ఐస్‌క్రీం రవి, సుబ్బరాయుడు, శ్రీరంజన్‌రెడ్డి, డిష్‌ జిలాన్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2001లో బుగ్గవంకకు వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆ ఘటనకు చలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాను 2004లో అధికారంలోకి రాగానే రూ.70 కోట్లతో బుగ్గవంక రక్షణగోడ, సుందరీకరణ పనులు చేపట్టారన్నారు. వైఎస్‌ హయాంలోనే 80 శాతానికిపైగా పనులు అయిపోయాయని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు పెండింగ్‌ పనుల గురించి పట్టించుకోలేదన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.72 కోట్లు మంజూరు చేసి బుగ్గవంక రక్షణ గోడ పూర్తి చేయడంతోపాటు గోడ వెంట అప్రోచ్‌ రోడ్లు, కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని, 2023లో లాకాలేజీ, షామీరియా మసీదు వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. కాంట్రాక్టర్‌ తండ్రి చనిపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయని, ఈలోపు ఎన్నికలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి అవే నిధులకు జీవోలు మార్చి తీసుకొచ్చారని, తాము మంజూరు చేయించిన రూ.20 కోట్ల కంటే ఒక్క రూపాయి అదనంగా తేలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లోనే వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాధవి 16 నెలల తర్వాత మళ్లీ పనులు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన నిధులను మేమే తెచ్చామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి చెప్పుకొంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తమ శిలాఫలకాలను తొలగించి మీ పేర్లతో కొత్తవి వేసుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. దమ్ముంటే ప్రభుత్వంతో నగరాభివృద్ధికి నిధులు తెచ్చి శిలాఫలకాలు వేసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు. తమ ప్రభుత్వంలో పనులు రద్దు చేశారని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. అసత్యాలతో ప్రజలను ఎంతో కాలం మభ్యపెట్టలేరన్నారు. బుగ్గవంకపై బ్రిడ్జిలకు నిధులు సాధించిన ఘనత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలకే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు శిలాఫలకాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరని హెచ్చరించారు.

అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌

రూ.20 కోట్లు మంజూరు

కాంట్రాక్టర్‌ తండ్రి చనిపోవడంతో పనులు ఆలస్యం

టీడీపీ జీవోలు మార్చి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటు

మీడియాతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement