
రాజ్యాంగ పరిరక్షణ కోసం యాత్ర
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సోమవారం కడపకు చేరుకుంది. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమై అంబేడ్కర్ విగ్రహం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించడం తగదన్నారు. వర్గీకరణ అనేది చెల్లదని, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. దళిత వర్గాలను మాల మాదిగలుగా విభజించిన కారణంగా మాదిగలు తెలంగాణను కోరుకున్నారన్నారు. బ్రిటీషర్ల మాదిరిగా చంద్రబాబు దళితులను విభజించి పాలించాలనుకుంటున్నాడని, అది ఎప్పటికీ జరగదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మోదీ, బాబు పాలనపై ధ్వజం
కడప రూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తీవ్ర స్ధాయిలో ధ్వజ మెత్తారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
కేంద్ర మాజీ ఎంపీ చింతామోహన్