
గంగమ్మా..కాపాడవమ్మా
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ భక్తులు అమ్మవార్లను వేడుకున్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతపురం గంగమ్మను లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య, మాజీ ఎంపీపీ రెడ్డయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివారెడ్డి దర్శించుకున్నారు.ఆలయ అధికారులు వారిని సత్కరించారు.పూజల్లో ఉప మండల అధ్యక్షులు సమరసింహారెడ్డి, సుబ్బరాయుడు, సర్పంచ్‌లు వెంకటనారాయణ రెడ్డి, గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి, రమణయ్య, జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ నారాయణ, శంకర్ నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్‌లు సంజీవరెడ్డి, రాజబాబు, మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, పాల్గొన్నారు.