
ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు
కడప రూరల్ : ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు చేపడతామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా ఎన్జీఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు లెక్కలకొండారెడ్డి అన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేని ఉద్యోగులను గుర్తించామని, స్థలాల కేటాయింపునకు భూములు పరిశీలించామని తెలిపారు. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి.. త్వరలో ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ డైరెక్టర్లు టి.శ్రీనివాసులు, వెంకటరెడ్డి,చి న్నయ్య, బాలమురళి, రాఘవరెడ్డి, తిమ్మారెడ్డి, బాలపుల్లయ్య, పోలిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.