
కేజీబీవీ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో కెజీబీవీ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి కోరారు. కడప సీపీఐ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 మంది మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్‌కు 11 నెలల వేతనం ఇవ్వకపోవడంతో అర్ధకాలితో అలమటిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి కేంద్రీకరించి వేతనాల విడుదలకు కృషిచేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వేతనాల విడుదలకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అజిత, మౌనిక, నాగమణి, కృష్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు