
రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన
● డిజిటల్ బుక్‌తో ఈ ప్రభుత్వ పాపాల చిట్టా రాస్తున్నాం
● డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఆవిష్కరణలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో బీహార్, ఉత్తర ప్రదేశ్ తరహా ఆటవిక పాలన నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఇన్‌చార్జి మేయర్ ముంతాజ్ బేగంతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కక్షసాధించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఒక కంటెంట్‌ను షేర్ చేసినందుకు నిన్ననే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేశారన్నారు. వీళ్ల అరాచకానికి బలైన కార్యకర్తలు, నాయకులకు భరోసా కల్పించడానికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వంలోని నాయకులు, అధికారుల వల్ల అన్యాయానికి, వేధింపులకు, హింసకు గురైన బాధితులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని తమకు జరిగిన అన్యాయాన్ని, అన్యాయం చేసిన వారి పేర్లను నమోదు చేయాలన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్ చేయొచ్చన్నారు. సామాన్య ప్రజలు కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు. యాప్‌లో నమోదు చేయలేనివారు 040–49171718 నంబర్‌కు కాల్‌చేసి వారికి జరిగిన అన్యాయాన్ని తెలిపి నమోదు చేయించుకోవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి న్యాయం చేస్తామని, అక్రమ కేసులన్నీ కొట్టివేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జోన్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, ఐస్‌క్రీం రవి, నాగమల్లారెడ్డి, పి. రామ్మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్. వెంకటేశ్వర్లు, శ్రీరంజన్‌రెడ్డి, టీపీ వెంకట సుబ్బమ్మ, షఫీ, దాసరి శివ, బాలస్వామిరెడ్డి, ఏ1 నాగరాజు, మునిశేఖర్‌రెడ్డి, బండి దీప్తి, బి. మరియలు, షఫీవుల్లా, కంచుపాటి బాబు, సింధేరవి, రాయల్‌బాబు, జమీల్, పాల్గొన్నారు.