
పేదరికం, అస్పృశ్యతలే నా గురువులన్న జాషువా
కడప ఎడ్యుకేషన్ : పేదరికం, అస్పృశ్యతే తన గురువులని గుర్రం జాషువా చాటి చెప్పారని బిజేపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో’ జాషువా సయంతి సందర్భంగా కవి కోకిల గుర్రం జాషువా పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదట జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం విషాదం చిమ్మినపుడు ఎవరికై నా జాషువా గుర్తుకొస్తారన్నారు. వైఎస్సార్ కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆధునిక కవుల్లో జాషువా తర్వాతే ఎవరైనా ఎన్నదగినవారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీరంరెడ్డి సుబ్బారెడ్డి, ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి, డాక్టర్ జీవీ.సాయిప్రసాద్, డాక్టర్ అనుగూరు చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ తవ్వా వెంకటయ్య, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ పొదిలి నాగరాజు, సాహిత్య మిత్రులు, కొత్తపల్లి లక్ష్మినారాయణరెడ్డి, బొమ్మన విజయ్, తదితరులు పాల్గొన్నారు.