
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సత్వర పరిష్కరానికి తగిన చర్యలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఔట్‌సోర్సింగ్‌ఉద్యోగుల సంఘ రాష్ట్ర చైర్మన్ దూసి భానుజీరావు కోరారు. ఆదివారం గుంటూరు ఉద్యాన శాఖ మిని మీటింగ్ హాలులో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం నిర్వహించి 11 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎనుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ భానుజీరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ సిబ్బంది చిత్తశుద్ధితో, క్రమశిక్షణగా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని, వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర చైర్మన్‌గా దూసి భానుజీ రావు, ప్రధాన కార్యదర్శిగా పి.గురునాథ్ , వైస్ చైర్మన్‌గా కేవై దివాకర్ బాబు, వైస్ చైర్మన్–2గా రంగా భాస్కర్, కోశాధికారిగా యు.అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ కె.రవికుమార్, జాయింట్ సెక్రటరీ –2గా బి.వరపుత్రతోపాటు సభ్యులుగా సింహాచలం, సుబ్బారాయుడు, ఐవీ కృష్ణారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.