
అన్నను తిడుతున్నా పవన్ నోరువిప్పలేదెందుకు?
– మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : అన్న మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా బాలక్రిష్ణ వాడు, వీడు అంటుంటే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ప్రశ్నించారు. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ గౌరవ శాసన సభలో బాలకృష్ణ తలపై కళ్లద్దాలు, జేబులో చేతులు పెట్టుకొని తూగుతూ మాట్లాడటాన్ని ఎవరూ హర్షించడం లేదన్నారు. డాక్టర్లు ఽధ్రువీకరించిన మానసిక రోగి బాలకృష్ణ అన్నారు. సినీ పెద్దలను జగన్‌మోహన్‌రెడ్డి అవమానించారని ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ దుష్ప్రచారం చేశారన్నారు. నేడు చిరంజీవి స్పందించి ఆనాడు జరిగిన వాస్తవాలను బయటపెట్టారన్నారు. వైఎస్.జగన్ తమను ఎంత సాదరంగా ఆహ్వానించి, మర్యాద చేశారో అందులో చెప్పుకొచ్చారన్నారు. ఇప్పటికై నా చిరంజీవి స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన అన్నను అసెంబ్లీలో తూలనాడుతుంటే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌గానీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలుగానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మెంటల్ ఉందని డాక్టర్లు సర్టిఫై చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఽఎద్దేవా చేశారు. బాలక్రిష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు తనకు ఫోన్ చేశారని, వైఎస్సార్‌ను కలిసేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిని పంపాలని చెప్పానన్నారు. వైఎస్సార్ కుటుంబానికి బాలక్రిష్ణ ఎల్లప్పుడూ రుణపడి ఉండాలన్నారు. తాను హైదరాబాద్ వెళ్లేసరికి వారిద్దరూ రాలేదని, తానే వెళ్లి ఉద్దేశ్యపూర్వకంగా కాల్చలేదని వైఎస్సార్‌ను బ్రతిమాలానన్నారు. ఆయన స్పందించి అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఆనాడు వారి బంధువులెవరూ ఆయన వెంట రాలేదని, చంద్రబాబైతే నాలుగు రోజుల తర్వాత వచ్చారన్నారు. బాలక్రిష్ణ స్థలం రోడ్డు విస్తరణలో పోతుంటే రోడ్డును డైవర్ట్ చేసి స్థలాన్ని కాపాడారన్నారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి టీడీపీ హయాం నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉంటే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసి పెద్ద మనసు చాటారన్నారు. చేసిన మేలు మర్చిపోయి అసెంబ్లీలో తాగి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.

అన్నను తిడుతున్నా పవన్ నోరువిప్పలేదెందుకు?