
లీగల్ ఎయిడ్ క్లినిక్ సందర్శన
పులివెందుల టౌన్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎస్.బాబా ఫకృద్దీన్ పులివెందుల సబ్ జైలులో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను గురువారం సందర్శించారు. రిజిష్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం గురించి వివరించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలు, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జైలు పరిసరాలు, రిజిష్టర్లను పరిశీలించి సూచనలు చేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు, ఖైదీలు పాల్గొన్నారు.
నకిలీ ఉత్పత్తుల స్వాధీనం
కడప కార్పొరేషన్ : కడప నగరంలో నకిలీ జేఎస్‌డబ్ల్యూ సిల్వర్ పూత కలిగిన షట్టర్ 18 షట్టర్ భాగాలు, ముద్రణ అచ్చులు కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బ్రాండెడ్ ఉత్పత్తుల నకలు తయారు చేసి అసలైనవిగా మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కస్టమర్లు, బ్రాండ్ సమగ్రతను రక్షించడానికి జెఎస్‌డబ్ల్యూ స్టీల్ నిరంతరం పనిచేస్తుందన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిర్దిష్ట సమాచారం ఉందన్నారు. దీంతో తమ స్టీల్ కోటెడ్ బృందం షట్టర్ ఉత్పత్తులు, దాని ట్రేడ్‌మార్క్ సిల్వర్ గుర్తు దుర్వినియోగాన్ని ఽధృవీకరించేందుకు దర్యాప్తు నిర్వహించిందన్నారు. ఈ నేపథ్యంలోనే కడప ఎస్‌డీఎస్ సన్స్ భాగోతం బయట పడిందని, సమాచారం పోలీసులకు అందించామని తెలిపారు.
ఫైనాన్షియర్ హత్య కేసులో టీడీపీ నేత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేపిన పైనాన్షియర్ వేణుగోపాల్‌రెడ్డి హత్య కేసులో టీడీపీ నేత ఎడమకంటి వెంకట సుబ్బారెడ్డిని ఏ2గా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో అదే పట్టణానికి చెందిన బిల్డర్ వెన్నపూసలక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకట సుబ్బారెడ్డితోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బోయినినగేష్, లైని అజయ్ కుమార్, చింతలచెరువు ప్రణయ్ కుమార్, కొత్త శివప్రసాద్ నిందితులుగా ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బాకరాపేట వీధికి చెందిన ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి అనుచరుడిగా ఉంటూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. టీడీపీ నేతల అండ చూసుకునే అయన ఈ హత్యలో పాల్గొని ఉంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

లీగల్ ఎయిడ్ క్లినిక్ సందర్శన

లీగల్ ఎయిడ్ క్లినిక్ సందర్శన