
ఏఎఫ్‌యూలో తాత్కాలిక ఫ్యాకల్టీ నియామకం
కడప ఎడ్యుకేషన్ : డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(కడప)లో తాత్కాలిక విజిటింగ్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.విశ్వనాథకుమార్ తెలిపారు. ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించి బి.ఆర్క్‌లో కనీసం 60 శాతంమార్కులు, మూడేళ్ల వృత్తి అనుభవం, బి.ఆర్క్‌తోపాటు మాస్టర్స్ డిగ్రీ(సంబంధిత సబ్జెక్ట్)లో కనీసం 60 శాతం మార్కులు, మూడేళ్ల అనుభవం కలిగి ఉండేవాళ్లు అర్హులని తెలిపారు. అలాగే ఇంటీరియర్ డిజైన్ విభాగానికి సంబంధించి బి.ఆర్క్.లో కనీసం 60 శాతం మార్కులు, సంబంధిత పీజీ అర్హతతోపాటు కనీసం మూడేళ్ల డిజైన్ అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఆర్కిటెక్చర్/ప్లానింగ్/జాగ్రఫీ/ఎకనామిక్స్/సోషియాలజీ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ ప్లానింగ్‌లో ఫస్ట్ క్లాస్ ఉండాలని తెలిపారు. ఈ పోస్టులకు ఈ నెల 26వ తేదీ ఉదయం పది గంటలకు చెన్నూరు మండలం రాయలపంతులపల్లిలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇంటర్వూలు ఉంటాయని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమకు సంబంధించిరి రెజ్యూమ్‌తోపాటు ఒరిజినల్ సర్టిఫిపకెట్లతోపాటు సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని నేరుగా వాక్– ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదా డెమో క్లాస్ ఇవ్వాల్సి ఉంటుందని వీసీ విశ్వనాథకుమార్ తెలిపారు.