
డిప్యూటీ మేయర్‌తో మాజీ డిప్యూటీ సీఎం చర్చలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, ఆమె భర్త మాజీ కార్పొరేటర్ జమాల్‌వలితో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసి డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగానికి ఇన్‌చార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె బాధ్యతల స్వీకరణ, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అజ్మతుల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు బసవరాజు, డిష్ జిలాన్, రెడ్డి ప్రసాద్, రమేష్ రెడ్డి, గయాజ్, అతావుల్లా, డా. మురాద్, మున్నా, మహబూబ్ పాల్గొన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీని
కలిసిన ఎస్పీ
కడప అర్బన్ : రాష్ట్ర పూర్వ డీజీపి, ప్రస్తుత ఏపీఎస్‌ఆర్‌టిసీ ఎండీ సిహెచ్.ద్వారకాతిరుమల రావు కడపలో గురువారం పర్యటించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయనను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆత్మీయంగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు.