
బోధనలో కృత్రిమ మేధను ఉపయోగించాలి
కడప ఎడ్యుకేషన్ : కృత్తిమ మేధను బోధన, పరిశోధనలో వినియోగిస్తే విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు సృషి్‌ాట్స్తరని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ఉషా విభాగం ఆధ్వర్యంలో ‘క్రియాశీల బోధన కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాలు, సాంకేతిక పద్ధతులు‘ అనే అంశంపై జాతీయ స్థాయి ఒకరోజు ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ సాంకేతిక విధానాలు విద్యార్థులు, అధ్యాపకులకు జ్ఞానం పెంపొందించడానికి సహాయపడతాయన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పుత్తా పద్మ మాట్లాడుతూ కోవిడ్–19 మహమ్మారి కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అలవాటు అయ్యాయన్నారు. వైవీయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జి.వి. రమేశ్ బాబు, పీఎం ఉష ప్రాజెక్ట్ సమన్వయకర్త డాక్టర్ టి. చంద్రశేఖర్ మాట్లాడారు. డాక్టర్ ఎస్. సునీత, డాక్టర్ కె. లలిత, డాక్టర్ పి. సరిత తదితరులు పాల్గొన్నారు.