
అటవీ శాఖ గార్డు.. టీచర్ అయ్యాడు
కడప సిటీ : అటవీ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తూనే.. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కఠోర సాధన చేసి డీఎస్సీలో 11వ ర్యాకు సాధించి భళా అనిపించాడు. పెండ్లిమర్రి మండలం యల్లటూరు గ్రామానికి చెందిన గుర్రంపాటి రాజశేఖర్‌రెడ్డి కడప రాజేశ్వరీ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. నిరుద్యోగం వెంటాడుతుందనే భయంతో అటవీ శాఖలో గార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఎంపికయ్యాడు. 17 ఏళ్లుగా వేంపల్లె అటవీ రేంజ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అనంతరం గార్డు ఉద్యోగం చేస్తూనే 2014, 2019లో డీఎస్సీ రాశాడు. 2019లో 14వ ర్యాంకు వచ్చినా ఆరు పోస్టులు ఉండడంతో ఎంపికకాలేదు. అనంతరం తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో గార్డు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్ష రాశాడు. 11వ ర్యాంకు సాధించడంతో ఓసీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా ఎంపికయ్యాడు. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధించానని రాజశేఖర్‌రెడ్డి సాక్షికి తెలిపారు. 2019 డీఎస్సీకి ముందు 42 ఏళ్ల వయోపరిమితిని 2019లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచిందని, దీంతో వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడిందని అతడు తెలిపారు.
11వ ర్యాంకుతో
స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం