
సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. డీఈఓ షంషుద్దీన్‌ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచింగ్ స్కిల్, వర్క్‌షాప్, డెవలప్‌మెంట్ పేరుతో నారాయణ, చైతన్య, జీఎంఆర్ విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవుల్లో స్కూల్‌కు రావాలని, లేకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్, పెద్దన్న పాల్గొన్నారు.