
నేడు రౌండ్‌టేబుల్ సమావేశం
కడప రూరల్: ప్రజా సంఘాలు, మేధావుల ఆధ్వర్యంలో బుధవారం కడప వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పంతుల సంపత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో ప్రజా సంఘాల నేతలు, వైద్యులు, ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కమలాపురం: కమలాపురం పెద్దదర్గాగా వెలుగొందుతున్న దర్గా–ఏ–గఫారియాలో బుధవారం రాత్రి దస్తగిరి షా ఖాద్రి బర్సీ నిర్వహిస్తున్నట్లు దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారికి పూల చాదర్లు సమర్పించి, అనంతరం గంధం ఎక్కిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. రాత్రి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు విరివిగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ అన్నారు. మంగళవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, వ్యవసాయ, డ్వామా అధికారులకు నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ 2.ఓ లక్ష్యాల సాధనకు అందరూ నడుం బిగించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఇండికేటర్స్‌లో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ద్యం విషయంలో ఇప్పటికీ అత్యధికంగా వెనుకబడి ఉండడం బాధాకరమని వివరించారు. ఇప్పటికై నా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డీపీఓ రాజ్యలక్ష్మి, డీడీఓ మైథిలి తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీఓఎస్‌ఎస్ )లో ఓపెన్ ఇంటర్‌లో అడ్మిషన్లకు అపరాధ రుసుముతో గడువు పొడగించినట్లు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ చెప్పలి రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరంలో రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకోవచ్చన్నారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపు లకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కోర్సులో చేరదలచిన విద్యార్థులు రిమ్స్ రోడ్డులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశా లను సందర్మించి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ కోర్సులలో చేరేవారికి 16 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని, పదవ తరగతి మార్కు ల జాబితా, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు బు క్కు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో తీసుకొని నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. వివరాలకు 91820 99672 సంప్రదించాలని కో ఆర్డినేటర్ రాజారావు తెలిపారు.