
బాధితులకు న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. 119 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని నిర్ణీణ గడువులోపు పరిష్కరించాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీసీజీ డీఎస్పీ అబ్దుల్ కరీం, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్