
అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. వారాలు.. నెలలు కాదు.. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా ఫిర్యాదులు
పరిష్కారం కావడం లేదు.. అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టినా అధికారుల మనస్సు కరగడం లేదు.
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని నలు చెరుగుల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు ఆమె ఎదుట మొరపెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినా మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మచ్చుకు కొన్ని...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు తగలబడి సర్వం కోల్పోయాం. బేల్దారి పనికి వెళుతూ భార్యా పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. అసలే అరకొర ఆర్థిక పరిస్థితులతో అల్లాడుతున్న మాకు విద్యుత్ షార్ట్ సర్యూట్ మరింత అగాథంలోకి నెట్టింది. ఇంటి సామాగ్రితోపాటు సర్టిఫి కెట్లు, రూ. 50 వేల నగదు కూడాఅగ్నికి ఆహుతయ్యాయి. రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లింది. రోడ్డున పడిన మా కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నా.
– భార్గవరెడ్డి, సీకేదిన్నె మండలం
మా గ్రామ పొలంలో సర్వే నెంబరు 178లో 1.83 ఎకరాల విస్తీర్ణంలో స్మశాన స్థలం ఉంది. కొంతమంది స్మశానికి వినియోగిస్తున్న స్థలంలో మామిడి చెట్లు నాటారు. ఈ విషయంపై మేము తహసీల్దార్, ఇతర అఽధికారులకు ఫిర్యాదు చేశాం. అధికారులు విచారణ చేసి అది స్మశాన స్థలంగా తేల్చారు. అందులో బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదు. స్మశాన స్థలాన్ని సంరక్షించాలి. – జ్యోతి రామసుబ్బారెడ్డి, పొన్నోలు కొత్తపల్లె, సిద్దవటం మండలం
నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేశాను. మూడు సెంట్ల స్థలంలో నాకున్న ఇంటిని మాయమాటలు చెప్పి రాయించుకున్నారు. నేను వృద్ధుడిని. కాలు, చేయి సరిగా పనిచేయడం లేదు. కేవలం పింఛన్‌తో జీవిస్తున్నాను. అల్లుళ్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. మోసంతో కాజేసిన ఇంటిని తిరిగి నాకు ఇప్పిస్తే ఈ మలి వయస్సులో ఎవరైనా యోగక్షేమాలు చూస్తారు.
– రామాంజనేయులు,
బొజ్జావారిపల్లె, ప్రొద్దుటూరు
మేము ప్రొద్దుటూరులో ఔట్‌సోర్సింగ్ కింద గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేసేవాళ్లం. అక్కడి ఏఈ బల్క్‌గా ఇసుకను కాంట్రాక్టర్‌కు ఇచ్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇది కాంట్రాక్టర్, ఏఈకి మాత్రమే సంబంధించిన విషయం. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఉన్నతాధికారులు ఏఈని రక్షించుకోవడం కోసం మమ్మల్ని అన్యాయంగా గత సెప్టెంబరు 29న తొలగించారు. ఎలాంటి విచారణ లేకుండా తొలగించడం అన్యాయమంటూ గ్రీవెన్స్‌సెల్‌లో పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. – దూదేకుల పెద్ద గుర్రప్ప, ఎస్.కుమారి, ప్రొద్దుటూరు

అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !

అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !

అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !

అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !