
మైలవరం కరకట్టకు మరమ్మతులు
జమ్మలమడుగు : మైలవరం జలాశయం ఆనకట్టకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సోమవారం ‘ప్రమాదంలో మైలవరం జలాశయం’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం కరకట్ట వద్ద డీఈ మూర్తి ఆధ్వర్యంలో లష్కర్లు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ కరకట్ట వద్ద రాళ్లు కుంగిపోవడంతో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన ట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టుకు క్షమాపణ చెప్పిన పులివెందుల ఆర్డీఓ
కడప సెవెన్‌రోడ్స్ : సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన యు.హరిత చౌక దుకాణ డీలర్‌షిప్‌ను ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా రద్దు చేసిన పులివెందుల ఆర్డీఓ పి.చిన్నయ్య రాష్ట్ర హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. సరైన కారణం చూపకుండా, చట్ట నిబంధనలు గాలికి వదిలి ఆమైపె చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎఫ్‌పీ షాపు డీలర్ హరిత హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆర్డీఓను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు సంధించిన ప్రశ్నలకు ఆర్డీఓ సరైన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పారు.
రిపబ్లిక్ డే ప్రి పరేడ్ శిబిరాల ఎంపికలు
కడప ఎడ్యుకేషన్ : వెస్ట్ జోన్ ప్రీ–రిపబ్లిక్ డే క్యాంపులో పాల్గొనేందుకు వైవీయూ–ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వలంటీర్ల ఎంపిక నిర్వహించారు. ఈ జోన్ నుంచి విజయవంతమైన అభ్యర్థులు న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రాతినిధ్యం వహి స్తారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఎంపికలకు అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లా నుంచి వంద మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. వారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిలో ముగ్గురిని ప్రీ రిపబ్లిక్ డే క్యాంపునకు ఎంపిక చేశారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయ యువజన అధికారి డాక్టర్ సయ్యద్, వైవీయూఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కే శ్రీనివాసరావు, డాక్టర్ కె. లలిత, డా. ఎస్పీ వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు.
జిల్లాకు చేరిన యూరియా
కడప అగ్రికల్చర్ : ఉమ్మడికడపజిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 1011 మెట్రిక్ టన్నులు వైఎస్సార్‌జిల్లాకు కేటాయించగా ఇందులో 534 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్‌కు కేటాయించగా మరో 176 మెట్రిక్ టన్నులు మనగ్రోమోర్ సెంటర్లకు మిగిలిన 301 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లుకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 324 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.

మైలవరం కరకట్టకు మరమ్మతులు