
దసరాకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డి సర్కిల్ : దసరా పండుగను పురస్కరించుకుని వంద ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీ, వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ నుంచి 30బస్సులు, బెంగుళూరు నుంచి 30 బస్సులు, చైన్నె నగరం నుంచి 10 బస్సులు, 27, 28వ తేదీల్లో విజయవాడ నుంచి 30బస్సులను నడపనున్నామని తెలిపారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలకు కడప రీజియన్ నుంచి 40ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఆర్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
25న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు
– డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025కు ఎంపికై న వారికి ఈనెల 25వ తేదీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేయనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైఎస్సార్‌జిల్లాలో నియాయక పరీక్ష రాసిన అభ్యర్థులు తమకు అందజేసి ఐడెంటిటీ కార్డులతో ఈనెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు కడప ఆర్ట్స్ కళాశాలలో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని సూచనలు డీఎస్సీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపులో పంపిస్తామని డీఈఓ వివరించారు.