
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్‌ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్‌రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటో బోల్తా
కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు.
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్‌తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్‌ను స్థానికులు బయటకు తీసారు.

ఒంటిమిట్ట రామయ్యకు పూజలు

ఒంటిమిట్ట రామయ్యకు పూజలు