
వ్యక్తి అదృశ్యం
ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్ నగర్‌లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు.
ఇంటి సామగ్రి దగ్ధం
చింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు.
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
కడప కోటిరెడ్డి సర్కిల్ : బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడిపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ రెడ్డప్ప తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నూరు మండలానికి చెందిన దావూద్ ఓ బాలికను ప్రేమ పేరుతో ఈ నెల 29న తీసుకు వెళ్లినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దావూద్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.