కడప కార్పొరేషన్: ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం యువకులపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని ముస్లిం మత పెద్దలు ఆక్షేపించారు. కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో వారు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐ లవ్ మహమ్మద్ బ్యానర్‌తో నిర్వహించిన ఈ నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్–ఉన్–నబీ వేడుకల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఐ లవ్ మహమ్మద్ బ్యానర్లను ప్రదర్శించడంతో యోగి ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రవక్త పేరు ప్రదర్శించినందుకే కేసులు నమోదు చేస్తే 40 కోట్ల మంది ముస్లింలు ఒప్పుకోరన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్‌బాబు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.