
ప్రమాదంలో మైలవరం జలాశయం!
జమ్మలమడుగు: మైలవరం జలాశయం ప్రమాదంలో పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు మైలవరం జలాశయం చుట్టూ ఉన్న కరకట్టకు పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మైలవరం జలాశయానికి గండికోట ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం ఐదు టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటి విడుదల అధికారులు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో నీరు నీల్వ ఉండటంతో ఇప్పటికే భూమిలో నుంచి నెమ్ము ద్వారా నీరు బయటికి వస్తోంది.మైలవరం కరకట్టకు ఏకంగా ఐదు చోట్ల రంధ్రాలు పడటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.
భద్రత ఏదీ!
ప్రస్తుతం మైలవరం జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో ఉండటంతో పర్యాటకుల తాకిడిపెరిగింది. జలాశయం చూటానికి వెల్లే రహదారికి ఇరువైపు ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండ గేట్ల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో మైలవరం జలాశయం పైన పర్యాటకులకు భద్రత కరువైపోయింది. గతంలో కోట్ల రూపా యలు ఖర్చుపెట్టి మరమ్మతు పనులు చేసిన అవి నిష్ఫలంగానే మారిపోతున్నాయి.
గుంతలు పడ్డాయి...
మైలవరం జలాశయం కరకట్ట మీద గుంతలు పడిన మాట వాస్తవమే . అధికారులు సైతం వచ్చి పరిశీలించారు. దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం. –సుబ్బారావు,
ఇరిగేషన్ ఏఈ మైలవరం

ప్రమాదంలో మైలవరం జలాశయం!