
● ఆలయ చరిత్ర
ఎందరో మహనీయుల సమిష్టి కృషికి ఈ ఆలయం చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడి సమీపంలోని పర్లపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి చిన్న కొండయ్య అనే వ్యాపారికి కలలో కనిపించిన శ్రీ కన్యకా పరమేశ్వరి ‘‘పెనుగొండ వాసినైన నేను కడప జిల్లా పినాకిని నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రొద్దుటూరు పట్టణంలో కొలువు తీరనున్నాను’అని చెప్పడం జరిగింది. తనకు ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మింప చేయాలని చెప్పడంతో 128 సంవత్సరాల క్రితం వ్యాపారి కామిశెట్టి చిన్న కొండయ్య ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు. ఎందరో మహానుభావులు, జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకులు, పదవిలో ఉన్నవారు ఆలయాన్ని దర్శించుకున్నారు. 1929లో జాతిపిత మహాత్మ గాంధీ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి ఆలయంలో 40 రోజుల పాటు బస చేసి యజ్ఞయాగాదులు నిర్వహించారు. అమ్మవారి శాల గర్భగుడి లోపల గ్రానైట్ రాతితో, మార్బుల్ రాళ్లతో మనోహరంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి వెండి తొడుగులను అమర్చారు. ఆలయంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర దేవి జన్మ వృత్తాంతం తెలిపే చిత్రపటాలు దర్శనమిస్తాయి.
ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల ఆలయ
గోపురం