
కస్తూర్బాగాంధీ విద్యాలయం తనిఖీ
వల్లూరు : వల్లూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానందరాజు శుక్రవారం తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థనా సమయానికి విద్యాలయానికి చేరుకున్న ఆయన ప్రార్థన అనంతరం మెనూ పరిశీలించారు. సరకుల నిల్వలు, స్టాకు నమోదు, రోజువారీ వినియోగం అంశాలను పరిశీలించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న హాస్టల్ నిర్వహణపై ప్రిన్సిపల్, అకౌంటెంట్‌కు సూచనలు చేశారు. రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జీసీడీవో రూత ఆరోగ్యమేరీ అన్నారు. అనంతరం హాస్టల్ మానిటర్ యాప్ టీమ్ సభ్యులు శివనాగేంద్రప్రసాద్ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నసీమున్నీసా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.