
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
కడప అర్బన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సారిగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక జార్జ్‌కారొనేషన్ క్లబ్‌లో శుక్రవారం అండర్ –14, 17 జిల్లా స్థాయి ఎస్జీఎఫ్‌ఐ రైఫిల్ షూటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొని, తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఓపన్ సైట్, పీప్ సైట్, పిస్టల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను ఎస్జీఎఫ్‌ఐ సెక్రటరీలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్రావతి, జార్జ్‌కారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్ బాలగంగిరెడ్డి, కో ఆర్డినేటర్‌లు ప్రవీణ్ కిరణ్, రాఘవేంద్ర, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పర్యవేక్షించారు.
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ కోర్సులో శుక్రవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎంసెట్ ద్వారా వెటర్నరీ విశ్వవిద్యాలయం నిర్వహించిన మొదటి కౌన్సెలింగ్‌లో ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి, కళాశాల అడ్మిషన్ బృందం వారిని అడ్మిట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ 19, 20, 21 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 22 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందిర, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్రావణి ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్‌పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్‌గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్‌కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్‌కు వెళ్లి పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగంలో సాధించిన సాంకేతిక అభివృద్ధి ముఖ్యంగా భారత్ ఈ రంగాల్లో సాధించిన ప్రగతిపై చర్చించేందుకు బీఐఎస్ సంస్థ ఈ అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది.

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ