
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరుసగా నాలుగు రోజులుగా పడిన ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ఒక రకంగా ముప్పే. ముఖ్యంగా ఉల్లి, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలు, పూల తోటలపై ప్రభావం చూపిస్తాయి. ఇంతటితో తగ్గుముఖం పడితే అంతగా నష్టం కలగదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పూల తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యాన పంటలైన మామిడి, సపోట, జామ, నిమ్మ, పెద్దనిమ్మ తదితరాలకు ఒక రకంగా మేలు జరగనుంది. మిగతా వ్యవసాయ, ఉద్యాన పంటలకు మాత్రం కొంతమేర ముప్పే.
మూడో రోజూ కురిసిన వాన
అత్యధికంగా వేములలో 40 మి.మీ