
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
కొండాపురం : అప్పటి వరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుతున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మండలంలోని దత్తాపురం పునరావాస కేంద్రంలోని వంకలో పడి ఎనిమిదేళ్ల బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దత్తాపురం గ్రామానికి చెందిన పాపన్నగారి గుణదీపక్(8) మూడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదగా వినాయకుని విగ్రహం తయారు చేసుకోవడానికి బంకమట్టికోసం వంక దగ్గర తీసే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో పడి పోయాడు. కుటుంబీకులు గుర్తించేలోగానే బాలుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపా రు. తల్లిదండ్రులు గంగాధర్, గీతలు గుండెలవిసేలా ఏడ్చారు. బాలుడు మృతితో గ్రా మంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఉత్సాహంగా క్రీడా ఎంపికలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జి కారొనేషన్ క్లబ్‌లో ఉమ్మడి కడప జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు తమ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈనెల 23 నుంచి 26 వరకు కాకినాడ, రాజమండ్రిలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఫెన్సింగ్ పోటీలకు 28 మంది క్రీడాకారులు పాల్గొనగా 14 మంది, రైఫిల్ షూటింగ్‌లో 16 మంది పాల్గొనగా 9 మంది, టేబుల్ టెన్నిస్‌లో 17 మందికి గాను 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలను జార్జికారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ రాజు, కోచ్ రాఘవ, అల్లాబకాష్, శివారెడ్డి తదితరులు పర్యవేక్షించారు.

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య