
వైఎస్‌ఆర్ పేరు తొలగింపు సరికాదు
ఉమ్మడి రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు కట్టించి, వైద్య సేవలు అంచిందిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. నాలుగు జిల్లాలకు నడిబొడ్డున రిమ్స్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రిమ్స్‌ను అప్‌గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించారు. మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి జగన్ జాతికి అంకితం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు తీసేయడం సిగ్గు చేటు. దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి.
–కె.సురేష్‌బాబు, నగర మేయర్, కడప