
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు.
– సాగర్, గర్భిణి భర్త