
నాపై పోలీసులు దాడి చేశారు
కడప అర్బన్ : హోటల్‌లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కడపలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
కడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్, అప్సర సర్కిళ్లలో ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలు, ఆర్టీసీ బస్టాండ్‌లో సోదాలు జరిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను నడిపేటపుడు నిబంధనలను పాటించాలన్నారు. లాడ్జీలలో గదులను అద్దెకు ఇచ్చేటపుడు గుర్తింపుకార్డును తీసుకోవాలని సూచించారు.

నాపై పోలీసులు దాడి చేశారు