
అండర్–19 తైక్వాండో పోటీలకు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రైల్వే కోడురూలో నిర్వహించిన అండర్–19 తైక్వాండో పోటీలలో కడప విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి చంంద్రమోహన్‌రాజు పేర్కొన్నారు. తైక్వాండో 44 కిలోల విభాగంలో నాగమోక్షిత, 55 కిలోల విభాగంలో పీవీఎస్.రెడ్డెమ్మ, 59 కిలోల విభాగంలో కెఆర్.సరయురెడ్డి బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర 54 కిలోల విభాగంలో కెఆర్.సాత్విక్‌రెడ్డి, 85 కిలోల విభాగంలో మునిచైతన్య బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ వెంకటేష్, శారద, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలిపై వానరం దాడి
రాజంపేట రూరల్ : 75 ఏళ్ల వృద్ధురాలు మన్నూరు చెంగమ్మపై వానరం దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని ఎగువ మందపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిలో చెంగమ్మకు కుడి మోచేయి వద్ద నరం కట్ అయినట్లు ఆమె బంధువులు తెలియజేశారు. చెంగమ్మ రాజంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వానరాల సంచారంపై ప్రజలు పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదన్నారు. ఇప్పటికై నా వానరాలను పట్టి అడవిలో వదిలేయాని కోరారు.
14005 కేసులకు పరిష్కారం
– రూ.9,94,86,943 కక్షిదారులకు చెల్లింపు
కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్‌లో 14005 కేసులు పరిష్కరించి, కక్షిదారులకు రూ.9,94,86,943 చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కడపలో నాలుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలో మూడు చొప్పున, బద్వేల్‌లో రెండు, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు మరియు రైల్వే కోడూరులో ఒకటి చొప్పున బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్‌లో లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి కేసులను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరి బాబా ఫకృద్దీన్‌లు కేసుల పరిష్కారానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అండర్–19 తైక్వాండో పోటీలకు ఎంపిక