
కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఆసక్తికరంగా క్రీడా ఎంపికలు జరుగుతున్నాయి. శుక్రవారం నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్– 14,17 బాల బాలికలకు రాష్ట్ర స్దాయి ఎంపికలు నిర్వహించారు. టెన్నిస్, టేబుల్ టేన్నిస్, ఊషు, తంగట, ఖురేష్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి ఈ క్రీడలను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఈ ఎంపికలకు 14 సంవత్సరాల, 17 సంవత్సరాల విభాగాల నుంచి దాదాపు 350 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అమరావతి
క్వాంటం వ్యాలీకి ఎంపిక
వేంపల్లె : రాష్ట్రస్థాయి అమరావతి క్వాంటం వ్యాలీకి ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈనెల 10వ తేదీన రీజనల్, జోనల్ స్థాయి అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌లో సత్తా చాటారు. గతనెల 28వ తేదీన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో జరిగిన ఇంటర్నల్ క్వాంటం వ్యాలీ హ్యాక్‌థాన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్లను తిరుపతిలోని మహిళా యూనివర్సిటీకి పంపగా, అక్కడ కూడా ఆ రెండు టీంలు సత్తా చాటి రూ.10వేల క్యాష్ అవార్డుతోపాటు ప్రశంసా పత్రంను అందుకున్నారు. ఈ రెండు టీంలలో సుమారు 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులను ఆకాంక్షించారు.
15న సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈ నెల 15న జిల్లా స్థాయి సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ పురుషులు, మహిళల జట్లు ఎంపికలను నిర్వహిస్తుననట్లు పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు కడప నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27, 28 తేదీలల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9966211903 అనే నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
వైద్యరంగంలో జనరల్
మెడిసిన్‌కు ప్రత్యేక స్థానం
కడప అర్బన్ : వైద్యరంగంలో జనరల్ మెడిసిన్‌కు ప్రత్యేక స్థానం వుందని ఏపీఐ చైర్మన్ డాక్టర్ మనోజ్‌కుమార్ తెలియజేశారు. ఏపీకాన్ –2025 ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్) ఆవరణంలో 53వ వార్షిక అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా వారి ఏపీ స్టేట్ ఏపికాన్ –2025 సదస్సు నిర్వహణకు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం నిర్వహణలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులు వివిధ కేటగిరిలలో తాము ప్రెజెంటేషన్ చేయాలనుకున్న అంశాలను జనరల్ మెడిసిన్ వైద్యాధికారుల ముందు తెలియజేశారు. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమాలను జాతీయ స్థాయి 53వ కాన్ఫరెన్స్‌గా కడప నగర శివార్లలోని రాయచోటి రోడ్డులో వున్న మాధవి కన్వెన్షన్ హాల్‌లో 13, 14 తేదీలలో జాతీయ స్థాయిలో అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. కార్యక్రమాలను డాక్టర్ టి. మునీశ్వర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్‌గా డాక్టర్ యాదవేంద్రారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అర్జున్‌కుమార్ వ్యవహరించనున్నారు.

కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలు