
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జూనియర్ కబడ్డీ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలికలు 150 మంది, బాలురు 200 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరి శ్రీకాంత్‌రెడ్డి, సెక్రటరి చంద్రావతి, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ గురుశేఖర్, సెక్రటరి సుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాణి,ఎస్‌జీఎఫ్ అండర్–19 సెక్రటరి చంద్రహాజరాజు, విక్టర్ కోచ్‌లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి కబడ్డీ పోటీలకు ఎంపికై నది వీరే..
బాలురు జట్టు : వేణుసాయి, దుర్గశంకర్, బ్రహ్మయ్య, నూర్ భాష, మల్లి ఖార్జున, కలాం, సాయి ప్రసాద్, యశ్వంత్, జయంత్ నాయక్, హుస్సేన్, మల్లిఖార్జున, నరేంద్ర, జశ్వంత్, గఫార్ బాషా.
బాలికల జట్టు : జ్యోత్న, నీల మహేశ్వరి, రంగ శివజ్యోతి, సునీత, పల్లవి, సిఎం రామలక్ష్మీ, వర మేఘన, హేమ ప్రియ, షషీనా, మైధిలి, అయ్యవారమ్మ, గంగాదేవి, అనిత, కృపా జ్యోతి.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న బాలుర జట్టు
రాష్ట్ర పోటీలకు ఎంపికై న బాలికల జట్టు

జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక