కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు గురువారం ప్రారంభం అయ్యాయి. స్థానిక కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 57 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా చక్కగా బ్యాటింగ్ చేసి 107 పరుగులు, సాయి గణేష్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని షేక్ కమిల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు.
వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్సార్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోషన్ పవన్ కుమార్ 213 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో అద్బుతంగా బ్యాటింగ్ చేసి 226 పరుగులు చేశాడు. సోహర్ వర్మ 53 పరుగులు, సూతేజ్ రెడ్డి 89 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు