
ఉత్సాహంగా సాగిన ఎస్‌జీఎఫ్ క్రీడలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అండర్– 14, 17 రాష్ట్రస్థాయి పోటీలకు బాల బాలికల ఎంపిక నిర్వహించారు. ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాలలో పోటీలను ప్రత్యేకాధికారి జగన్నాథరెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి, చంద్రావతి, ప్రవీణ్ కిరణ్, శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.