
బెదిరింపులతో డబ్బు లాక్కున్న ముగ్గురు అరెస్టు
కడప అర్బన్ : కడప రిమ్స్ పీఎస్ పరిధిలోని తిలక్ నగర్ ఆంజనేయస్వామి గుడి సమీపంలో వెళ్తున్న వారిని బెదిరిస్తూ పర్సు లాక్కుని పరారవుతున్న చాంద్‌బాషా, మురాఫత్ అలియాస్ లడ్డు, గౌస్ పీర్లను గురువారం అరెస్ట్ చేసినట్లు కడప రిమ్స్ పోలీసులు తెలిపారు. గత నెల 22వ తేదీ రాత్రి తిలక్ నగర్ సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద వాకింగ్ చేస్తున్న ఇందుమతి, ఇంకా ఇద్దరు మహిళలు, అటువైపుగా వెళ్తున్న యువకులను బెదిరించి నిందితులు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఇందుమతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రిమ్స్ వైద్య విద్యార్థిని ప్రతిభ
కడప అర్బన్ : కడప రిమ్స్ వైద్య విద్యార్థిని కల్లూరి కిరణ్మయ ప్రతిభ కనబరచి బంగారుపతకం అందుకున్నారు. వైఎఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెకు చెందిన కల్లూరి శివప్రసాద్‌రెడ్డి (లేట్), ఎద్దుల రత్నమ్మల కుమార్తె కల్లూరి కిరణ్మయి కడప రిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తోంది. అనాటమీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భళా అనిపించింది. చిన్నపుడే తండ్రిని కోల్పోయిన కిరణ్మయి తల్లి రత్నమ్మ, మేనమామ, అత్త ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ సీటు సాధించి కడప రిమ్స్‌లో చేరారు. అనాటమీ విభాగంలో మొదటి సంవత్సరంలో ప్రతిభ చూపి బంగారు పతకానికి ఎంపికయ్యారు. ఈ నెల 9న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, ముఖ్య అతిథి డాక్టర్ ఓ.పి.యాదవ్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకున్నారు. కిరణ్మయి మాట్లాడుతూ భవిష్యత్తులో పీజీ వైద్యను డీవీఎల్ విభాగంలో అభ్యసించాలని, ప్రజలకు తమవంతుగా వైద్య సేవలదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.