
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు
కలసపాడు : మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తులచంద్రమోహన్, బత్తులఆదిలక్ష్మి, స్వర్ణ శ్రీనాథ్‌లపై పోలీసులు గురువారం అక్రమ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తుల చంద్రమోహన్ పొలంలో టీడీపీ నాయకుడు ఇటీవల గ్రావెల్ రోడ్డు వేశాడు. 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎవరికి ఉపయోగంలో లేదు. ఇటీవల గ్రామ టీడీపీ నాయకుడు కక్ష సాధింపులో భాగంగా చంద్రమోహన్ పొలంలో అడ్డంగా రోడ్డు వేశాడు. అయినా చంద్రమోహన్ ఏమీ అనలేదు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ట్రాక్టర్‌తో చంద్రమోహన్ మిగిలిన భూమిని దున్నుకున్నాడు. రోడ్డును దున్నేశాడని టీడీపీ నాయకుడు బక్కిరెడ్డినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు మామిళ్లపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్, అతని భార్య ఆదిలక్ష్మి, ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనాథ్‌లపై అక్రమంగా కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
డ్రైవర్‌పై అనుచిత వ్యాఖ్యలు
మామిళ్లపల్లె గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ స్వర్ణశ్రీనాథ్‌పై ఎస్‌ఐ తిమోతి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నీపై రెండు, మూడు కేసులు ఉన్నాయని దుర్భాషలాడినట్లు బాధితుడు శ్రీనాథ్ తెలిపారు.