
ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలి
కడప ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వం మోమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరించాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ పోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్, శోభారాణి డిమాండ్ చేశారు. కడప తాలూకా కేంద్రం వద్ద నల్లబాడ్జీలు ధరించి గురువారం మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజ్జల తిరుపాల్, శోభారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు (7361 మంది), పోలీసులు (1821), గ్రూప్ 1, గ్రూప్2 ఉద్యోగులకు(1800) పాత పెన్షన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్, 01 తదుపరి నియామకం జరిగి సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న సుమారు 11000 మందికి పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పాత పెన్షన్ అమలుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు గత ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బి.గంగాధర్, ఎస్.బాబూరెడ్డి, పి.వెంకటసుబ్బారెడ్డి, చెన్నయ్య, రోజారాణి, చంద్రకళ, కె.చెన్నయ్య, లక్ష్మీరాజా, మోపూరి వెంకట శివారెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, రామిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ప్రతాపుడు, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్