
రెడ్‌బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి కూడా స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. స్టేట్‌మెంట్ పబ్లిష్ చేస్తే కేసులు పెడతారా? కంటెంట్ మారినా.. ఒక నాయకుడి ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు ఈ రాష్ట్రంలో లేవా? ప్రజాస్వామ్య దేశంలో మొదటి సారి ఇలాంటి విచిత్రాలు చూస్తున్నాం. ఎంతో కాలం ఇలాంటి ఆగడాలు సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
–ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం
సమంజసం కాదు
ఒక రాజకీయ నాయ కుడు తన అభిప్రా యాన్ని తెలియయజేసినప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రజల పక్షాన ఉన్న పత్రికల బాధ్యత. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం సమంజసం కాదు .అది పత్రికా స్వేచ్ఛను,వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే.కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఆగడాలు ఎంతో కాలం సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కొరముట్ల శ్రీనివాసులు,
మాజీవిప్, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు
కొత్త సంస్కృతికి తెర
రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని, ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, ఎడిటర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం..ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది.ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు..ప్రజల ముందు కూడా నిలబడవు.
–గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్

రెడ్‌బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు

రెడ్‌బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు

రెడ్‌బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు