
ప్రశాంతంగా స్టాఫ్‌నర్స్ నియామకాల కౌన్సెలింగ్
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4)లో గురువారం నిర్వహించిన కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ నియామకాల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎంపికై న 67 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టాఫ్‌నర్స్‌లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, సూపరింటెండెంట్‌లు శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్స్ బత్తనయ్య, వనీష తదితరులు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు గురువారం 1315 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. కడపకు వచ్చిన యూరియా ర్యాక్‌ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 395 టన్నులు మార్క్‌ఫెడ్‌కు పంపగా మిగతా 205 టన్నులు మన గ్రోమోర్ సెంటర్‌కు, మరో 300 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకు 415 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 328 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు, 58 టన్నులు మనగ్రోమోర్ సెంటర్లు, మరో 29 టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు చెప్పారు.