
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాలు మినహా మిగతా 32 మండలాల్లో వాన పడింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ఆరుతడి పంటలకు ఎంతో ఉపయుక్తం అని అన్నదాతలు తెలిపారు. పంటలకు ఉన్న చీడపీడలు తగ్గే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.
నాలుగు మండలాలు మినహా జిల్లా అంతటా వాన
కడపలో అత్యధికంగా 66.2 మి.మీ వర్షపాతం