ప్రతిభకు ఉపకారం
పరీక్ష విధానం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడుల్లో గ్రామీణ,పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుతుంటారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో అర్హత సాఽధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం అందుతుంది. దరఖాస్తుకు ఈనెల 4నుంచి 30వ తేదీ తుది గడువు విధించారు. పరీక్ష డిసెంబర్ 7వతేదీ నిర్వహిస్తారు.
ఎవరు అర్హులు: ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7 వ తరగతిలో ఓసీ,బీసీలైతే 55 శాతం, ఎస్సీ,ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమాన మైన గ్రేడ్ పొందిన వారు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు ,రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు WWW.bse.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.12 వేలు
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు ఈ పారితోషికానికి ఎంపికై తే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకారవేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు.
రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని విభాగాల వారీగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఇందులో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. మూడు గంటల పాటు పరీక్ష సమయాన్ని కేటాయించారు.
మెంటల్ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలుంటాయి. దీనికి 90 మార్కులు
స్కాలిసిస్ అప్టిట్యూట్ పరీక్ష: ఇందులో 7,8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య,సాంఘిక విషయాలపై ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 180 మార్కులు.
ఎన్‌ఎంఎంఎస్ సమాచారం ఇలా..
ఎన్‌ఎంఎంస్‌కు దరఖాస్తులకు వేళాయే
9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రోత్సాహకాలు
ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం
అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 8వ తరగతి విద్యార్థులు అర్హులు
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు
డిసెంబర్ 7న రాత పరీక్ష
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04–09–25
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికిచివరితేదీ : 30.09.25
దరఖాస్తుకు వెబ్‌సైట్: WWW.bse.gov.in
పరీక్ష ఫీజు వివరాలు ఓసీ, బీసీ విద్యార్థులకు ఫీజు: రూ.100
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు: రూ.50(ఎస్‌బిఐ కలెక్ట్ లింక్ ద్వారా)
ఎన్‌ఎంఎంఎస్ రాత పరీక్ష: 07.12.2025
ఎంపీపీ, జెడ్పీ స్కూళ్లు 7698
ప్రభుత్వ స్కూళ్లు 503
మున్సిపల్ స్కూళ్లు 1563
ఎయిడెడ్ స్కూళ్లు 423
ఓరియంటల్ స్కూళ్లు 171
ఏపీ మోడల్ స్కూళ్లు 276
ప్రతిభకు ఉపకారం


