
బాల్య వివాహాలను కట్టడి చేద్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా బాలల రీసోర్స్ సెంటర్‌లో సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు మిషన్ శక్తి పథకంపై పది రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేక అనర్థాలకు దా రి తీస్తాయని సూచించారు. మిషన్ వ్యాత్సల్య పథకం ద్వారా చిన్నారులను చట్టబద్దంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. సీడీపీఓలు శ్రీలత, సునీత, శ్రీదేవి, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ శోభారాణి, డీసీపీఓ సుభాష్ యాదవ్, సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అశ్విని, కౌన్సిలర్ పర్వీన్‌బాబు పాల్గొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 14న జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సీనియర్స్ బాల బాలి కల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 7 నుంచి 10 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.