నేపాల్‌లోని తెలుగువారి రక్షణకు చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకోసం వైఎస్సార్ కడపజిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము నెంబరు 08562–246344 ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటుచేసినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు 98183 95787, 85000 27678 ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఏపీఎన్ ఆర్‌టీఎస్ హెల్ప్‌లైన్ నెంబరు 0863 2340 678 సైతం అందుబాటులో ఉంటుంది. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలు పొందుపరిచేందుకు స్కానర్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూము 08562–246344


