గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Sep 10 2025 2:17 AM | Updated on Sep 10 2025 2:21 AM

ఎర్రగుంట్ల : యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పరిధిలోని పెన్నానదిలో గల్లంతు అయిన చెన్నూర్‌ ఫయాజ్‌ మృత దేహం లభించిందని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన చెన్నూర్‌ ఫయాజ్‌తో పాటు మరికొంత మంది యువకులు సోమవారం సాయంత్రం చేపలు పట్టడానికి పెన్నానది వద్దకు వెళ్లారు. అయితే చేపలు పడుతున్న సమయంలో చెన్నూరు ఫయాజ్‌ (25) అనే వ్యక్తి ప్రమాదశాత్తు నదిలో పడి గల్లంతు అయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీస్‌, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా బోటు సాయంతో సోమవారం రాత్రింతా గాలించారు. మంగళవారం ఉదయం కూడా బోటు సాయంతో పెన్నానది నీటి ప్రవహం వెంబడి గాలింపు చేశారు. హనుమనుగుత్తి గ్రామ సమీయంలో దడికి ఫయాజ్‌ మృతదేహం ఉండటం అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఎరువు కోసం వెళ్లి వస్తుండగా..

– లారీ ఢీ కొని రైతు మృతి

చాపాడు : మైదుకూరు– ప్రొద్దుటూరు ప్రధాన రహదారిలో గల మండల పరిధిలోని ఆనంద ఆశ్రమం క్రాస్‌ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమాపురం గ్రామానికి చెందిన లెక్కల లక్ష్మిరెడ్డి (65) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. లక్ష్మిరెడ్డి ఎరువుల కోసం మైదుకూరుకు వెళ్లి తిరిగి గ్రామానికి ఎక్స్‌ఎల్‌ ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమాపురం క్రాస్‌ రోడ్డు దాటుతుండగా ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జిపై నుండి ప్రొద్దుటూరుకు వెళుతున్న వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మోటార్‌ సైకిల్‌ నిప్పంటుకుని కాలిపోయింది. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారిని విస్తరణ చేసి ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించడం వలన సోమాపురం వెళ్లే గ్రామస్తులు రోడ్డు దాటుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణ అధికారులు చర్యలు తీసుకుని తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు.

టిప్పర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

ఖాజీపేట : జాతీయ రహదారి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె. సుబ్బయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే చాపాడు మండలం నాగసానిపల్లె గ్రామం వద్ద ఉన్న గుట్ట నుంచి మట్టిని టిప్పర్‌ ద్వారా తరలిస్తున్నారు. అందులో భాగంగా అల్లాడు పల్లె నుంచి ఖాజీపేట మండల పరిధిలోని జాతీయ రహదారి అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు రాగానే ముందు వెళుతున్న బైక్‌ను టిప్పర్‌ ఢీ కొంది. దీంతో బైక్‌ పై ఉన్న సుబ్బయ్య రోడ్డు నుంచి కాలువలో పడ్డాడు. కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖాజీపేట పోలీసులు అక్కడికి చేరుకుని చనిపోయిన వ్యక్తిని కడప రిమ్స్‌ లోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తిది ప్రొద్దుటూరు గా గుర్తించారు. ఆమేరకు టిప్పర్‌ డ్రైవర్‌ జహంగీర్‌ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్‌

కడప అర్బన్‌ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం కు పాల్పడిన రౌడీ షీటర్‌ రాజ్‌కుమార్‌ పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలిపారు. తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్‌ రాజ్‌ కుమార్‌ ఈనెల ఏడో తేదీన ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్‌ ఇచ్చి తన ఇంట్లో ఎత్తుకుని వెళ్లి అత్యాచారయత్నం కు పాల్పడే ప్రయత్నం చేశాడని తెలిపారు. ఈకేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు తెలిపారు.

తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం

– టపాసులు పడి బోదకొట్టం దగ్ధం

వీరబల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కరిముల్లా అనే వ్యక్తి బోదకొట్టం నిర్మించుకొని టీ అమ్ముకొని జీవనం సాగించేవాడు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌చార్జ్‌ పదవి చేపట్టిన జగన్‌ మోహన్‌ రాజు మొట్టమొదటి సారిగా మండలానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌లో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతో అవి ఆ బోదకొట్టంపై పడి పూర్తిగా కాలిపోయింది. దీంతో కరీముల్లా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండిపోయింది. కరీముల్లా ఇటీవల వేలు ఖర్చుచేసి బోదకొట్టం ఏర్పాటు చేసుకున్నాడు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం   1
1/3

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం   2
2/3

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం   3
3/3

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement