
జాతీయ స్థాయి పోటీలకు ‘భారతి’ విద్యార్థులు
కమలాపురం : మండల పరిధిలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) లోని డీఏవీ భారతి విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం పరిశ్రమ ప్రతినిధులతో కలసి ఆయన విజేతల వివరాలు వెల్లడించారు. ఇటీవల విజయ నగరం జిల్లాలోని రాజాం సీఎంఆర్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో ఎన్‌వీ కార్తిక్‌రెడ్డి ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే 400 మీ. పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రోలో ఎం. షారూన్ కుమార్ తృతీయ స్థానంలో, 4్ఙశ్రీ400 మీటర్ల పరుగు పందెంలో నరేష్, కార్తీక్, భార్గవ్, షారూన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్–17 బాలికల విభాగంలో వైశాలి ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారు. జావలిన్ త్రోలో విహారిక ద్వితీయ స్థానంతో పాటు 400మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచింది. అండర్–14బాలికల విభాగంలో ట్రిపుల్ జంప్‌లో అశ్లిత ప్రథమ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో కేవీ రుషి జావెలిన్ త్రోలో తృతీయ స్థానంలో నిలిచాడు. కాగా విజేతలుగా నిలిచిన వారిలో కార్తిక్ రెడ్డి (ట్రిపుల్ జంప్), వైశాలి (ట్రిపుల్ జంప్), విహారిక (జావెలిన్ త్రో), అశ్లిత(ట్రిపుల్ జంప్) లు త్వరలో జరగబోయే డీఏవీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కాగా విజేతలుగా నిలిచిన వారిని పరిశ్రమ సీఎంఓ సాయి రమేష్ ,ప్రతినిధులు గోపాల్‌రెడ్డి, భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రిలు అభినందించారు.