
కేఎన్‌ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై దాడి
పులివెందుల : పులివెందుల పట్టణంలోని శ్రీరామ హాలు రోడ్డులో ఉన్న కేఎన్‌ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ట్రావెల్స్ ఎదురుగా కారు పార్కింగ్ చేయడంతో ట్రావెల్స్‌లో పనిచేసే వ్యక్తి కారును పక్కకు తీయాలని బస్సు వస్తుందని తెలపడంతో మాట, మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ట్రావెల్స్‌లో పనిచేసే వ్యక్తిపై దాడికి పాల్పడటంతోపాటు ట్రావెల్స్‌లో ఉన్న ఫర్నీచర్, బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బస్సు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం