
మల్టీ డే మ్యాచ్‌లో చిత్తూరు, నెల్లూరు విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 55.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తేజరెడ్డి 142 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి 106 పరుగులు చేశాడు. రెడ్డి ప్రకాశ్ 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, ప్రవీణ్‌కుమార్ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 46.2 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నిస్కయ్ 47, ప్రవీణ్ కుమార్ సాయి 32 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బ్రహ్మసాయి తేజ్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 52, జెనిక్ దాస్ 34 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని భార్గవ 2 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప జట్టుపై నెల్లూరు జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం రెండవ రోజు 140 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 86.1 ఓవర్లలో 501 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 167, సోహన్ వర్మ 68, మాధవ్ 66, శ్రీ హర్ష 58 పరుగులు చేశారు. కడప జట్టులోని ఎస్‌ఎండీ ఆయూబ్ 4, వరుణ్‌తేజ్‌రెడ్డి 4, చెన్నారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 33.1 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 53, నాగ చాతుర్య 33 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, నారాయణ 2, సూతేజ్‌రెడ్డి 2 వికెట్లు తీశారు.

మల్టీ డే మ్యాచ్‌లో చిత్తూరు, నెల్లూరు విజయం

మల్టీ డే మ్యాచ్‌లో చిత్తూరు, నెల్లూరు విజయం

మల్టీ డే మ్యాచ్‌లో చిత్తూరు, నెల్లూరు విజయం